అల్ టైం హై లో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ:
సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్స్ అల్ టైం హైకి వెళ్ళాయి. స్వల్ప లాభం మొదలయిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 514 పాయింట్స్ లాభపడి 51,937 వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ కూడా మొదట్లో కొంచెం సేపు నష్టాన్ని చవిచూసిన తర్వాత మళ్లీ పుంజుకుని అల్ టైం హై లో ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 147 పాయింట్స్ లాభపడి 15582 వద్ద ముగిసింది.
గత శనివారం లాగానే ఈరోజు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ ని ముందుండి నడిపించింది,మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణం ఒక విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పవచ్చు. ఈరోజు RIL షేర్ ప్రైజ్ 3.13% పెరిగి 65 రూపాయల లాభంతో 2160 వద్ద ముగిసి నిఫ్టీ టాప్ గైనర్స్ లో ముందంజలో నిలిచింది.అలాగే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ వచ్చింది.
ఈరోజు మెటల్ స్టాక్స్ ఔట్ పెరఫామ్ చేశాయి. గత కొన్ని రోజులుగా మెటల్ స్టాక్స్ ఔట్ పెరఫామ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీనికి కారణం గ్లోబల్ గా ఉన్న స్టీల్ డిమాండ్ అని చెప్పవచ్చు. అలాగే ఈరోజు 1717 స్టాక్స్ పెరగగా 1449 స్టాక్స్ తగ్గాయి.ఇలాగ మార్కెట్ పెరగటానికి దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడం కూడా ఒక కారణం.
టాప్ గైనర్స్:
1) రిలయన్స్ ఇండస్ట్రీస్.
2) ఐసీఐసీఐ బ్యాంక్.
3) JSW స్టీల్.
టాప్ లోజర్స్:
1)ఎం&ఎం.

Comments
Post a Comment