4 నెలల్లో 100% పెరిగిన స్టీల్ కంపెనీ :
ఈ మధ్య గ్లోబల్ లో పెరిగిన స్టీల్ డిమాండ్ కారణంగా ఇండియాలో ఉన్న స్టీల్ కంపనీలు మంచి లాభాలు పొందాయి.ఇందులో భాగంగా దేశీయ దిగ్గజ కంపెనీకి చెందిన టాటా స్టీల్ షేర్ ప్రైజ్ ఏకంగా మూడు నెలల పదిహేను రోజుల్లోనే 100% పెరిగింది.ఫిబ్రవరిలో 615 వద్ద ఉన్న కంపనీ షేర్ ప్రైజ్ మే 14 రోజు వరకు 1244 గరిష్టనికి తాకింది. అంటే కేవలం 4 నెలల వ్యవధి లొనే షేర్ ప్రైజ్ డబల్ అయ్యింది.
గ్లోబల్ గా ఇలా స్టీల్ ప్రైజ్ లు పెరగటానికి ప్రధాన కారణం చైనా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన స్టీల్ ప్రొడక్షన్ నిబంధనలు అనే చెప్పవచ్చు. ఈ నిబంధనల కారణంగా చైనాలో స్టీల్ ప్రొడక్షన్ తగ్గింది.ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ గా ఉన్న చైనా ఇలా స్టీల్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల ,ఇతర దేశాలలో స్టీల్ డిమాండ్ బాగా పెరిగింది.
దీంతో ఇండియాలో స్టీల్ ఉత్పత్తి చేసే కంపెనీ షేర్ ప్రైజ్లుకూడాబాగా పెరిగాయి.jsw స్టీల్ షేర్ ప్రైజ్ 90% కి పైగాపెరగగా,మిగతా కంపెనీలు 50% కి పైగా పెరిగాయి.


Comments
Post a Comment