4.92 ట్రిలియన్ లోన్ ఫ్రాడ్ :

 ఆర్బీబీఐ బ్యాంక్ లోన్స్ కి సంబంధించి ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేసింది.కొన్ని రోజుల క్రిందట ఒక వ్యక్తి రాయిట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) ద్వారా దేశీయ బ్యాంకుల లోన్స్ గురించి అడగగా, దీనికి ఆర్బీఐ స్పందిస్తూ దేశీయ బ్యాంకులకు సంబంధించిన ఫ్రాడ్ లోన్ స్టేట్మెంట్ ని విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత దేశ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 78,072 కోట్ల రిపోర్ట్ చేసింది. ఆ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 39,733 కోట్ల తో రెండో స్థానంలో ఉంది, కాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా 32,224 కోట్ల తో మూడో స్థానంలో నిలిచింది.యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత స్థానంలో ఉన్నాయి.

దేశంలోని అన్ని బ్యాంక్లు కలిసి 4.92 ట్రిలియన్ లోన్ ఫ్రాడ్ ని ఆర్బీఐ కి రిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయమై దేశీయ ఆర్థిక నిపుణులు స్పందిస్తూ దేశంలోని బ్యాంకులు ఇలా పెద్ద మొత్తంలో ఫ్రాడ్ లోన్స్ రిపోర్ట్ చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని స్పష్టం చేశారు. కాగా బ్యాంకులు ఇంత మొత్తం ఫ్రాడ్ లోన్స్ రిపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి.ఈ ఫ్రాడ్ లోన్ అమౌంట్ దాదాపు ఇండియా లోని అన్ని బ్యాంకుల మొత్తం క్రెడిట్ లో 4.5% గా ఉండడం గమనార్హం.ఇది ఇలా ఉండగా ఆర్బీఐ ఇటీవలే,ఆర్బీఐ సర్ప్లస్ అమౌంట్ కింద 97 వేల కోట్లు ఇండియన్ గవర్నమెంట్ కి డివిడెండ్ గా ఇవ్వడం మనకు తెలిసిందే. ఆర్బీఐ అందించిన ఈ డివిడెండ్ డబ్బును ప్రభుత్వం దేనికి ఖర్చు చేస్తుందో చూడాలి.

Comments

Post a Comment

Popular posts from this blog

అల్ టైం హై లో స్టాక్ మార్కెట్లు:

4 నెలల్లో 100% పెరిగిన స్టీల్ కంపెనీ :