Posts

అల్ టైం హై లో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ:

Image
సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్స్ అల్ టైం హైకి వెళ్ళాయి. స్వల్ప లాభం మొదలయిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 514 పాయింట్స్ లాభపడి 51,937 వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ కూడా మొదట్లో కొంచెం సేపు నష్టాన్ని చవిచూసిన తర్వాత మళ్లీ పుంజుకుని అల్ టైం హై లో ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 147 పాయింట్స్ లాభపడి 15582 వద్ద ముగిసింది. గత శనివారం లాగానే ఈరోజు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ ని ముందుండి నడిపించింది,మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణం ఒక విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పవచ్చు. ఈరోజు RIL షేర్ ప్రైజ్ 3.13% పెరిగి 65 రూపాయల లాభంతో 2160 వద్ద ముగిసి నిఫ్టీ టాప్ గైనర్స్ లో ముందంజలో నిలిచింది.అలాగే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ వచ్చింది. ఈరోజు మెటల్ స్టాక్స్ ఔట్ పెరఫామ్ చేశాయి. గత కొన్ని రోజులుగా మెటల్ స్టాక్స్ ఔట్ పెరఫామ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీనికి కారణం గ్లోబల్ గా ఉన్న స్టీల్ డిమాండ్ అని చెప్పవచ్చు. అలాగే ఈరోజు 1717 స్టాక్స్ పెరగగా 1449 స్టాక్స్ తగ్గాయి.ఇలాగ మార్కెట్ పెరగటానికి దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడం కూడ...

4 నెలల్లో 100% పెరిగిన స్టీల్ కంపెనీ :

Image
ఈ మధ్య గ్లోబల్ లో పెరిగిన స్టీల్ డిమాండ్ కారణంగా ఇండియాలో ఉన్న స్టీల్ కంపనీలు మంచి లాభాలు పొందాయి.ఇందులో భాగంగా దేశీయ దిగ్గజ కంపెనీకి చెందిన టాటా స్టీల్ షేర్ ప్రైజ్ ఏకంగా మూడు నెలల పదిహేను రోజుల్లోనే 100% పెరిగింది.ఫిబ్రవరిలో 615 వద్ద ఉన్న  కంపనీ షేర్ ప్రైజ్ మే 14 రోజు వరకు 1244 గరిష్టనికి తాకింది. అంటే కేవలం 4 నెలల వ్యవధి లొనే షేర్ ప్రైజ్ డబల్ అయ్యింది. గ్లోబల్ గా ఇలా స్టీల్ ప్రైజ్ లు పెరగటానికి ప్రధాన కారణం చైనా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన స్టీల్ ప్రొడక్షన్ నిబంధనలు అనే చెప్పవచ్చు. ఈ నిబంధనల కారణంగా చైనాలో స్టీల్ ప్రొడక్షన్ తగ్గింది.ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ గా ఉన్న చైనా ఇలా స్టీల్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల ,ఇతర దేశాలలో స్టీల్ డిమాండ్ బాగా పెరిగింది.  దీంతో ఇండియాలో స్టీల్ ఉత్పత్తి చేసే కంపెనీ షేర్ ప్రైజ్లుకూడాబాగా పెరిగాయి.jsw స్టీల్ షేర్ ప్రైజ్ 90% కి పైగాపెరగగా,మిగతా కంపెనీలు 50% కి పైగా పెరిగాయి.

అల్ టైం హై లో స్టాక్ మార్కెట్లు:

Image
అల్ టైం హై ముగిసిన ఇండియన్ స్టాక్ మార్కెట్లు, నిన్న రాత్రి గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ కావడంతో. దేశీయ మార్కెట్స్ అయిన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా జీవిత కాల మార్క్ను తాకాయి. నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 15,435 వద్ద ముగియగా, సెన్సెక్స్ 307 పాయింట్ల లాభం తో 51,422 వద్ద ముగిసింది. అల్ గ్లోబల్ మార్కెట్స్ సానుకూలంగా వుండడం  మరియు మన దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం మార్కెట్లు లాభల్లో ముగియడానికి కారణం గా మార్కెట్ అనాలిసిట్ లు భావిస్తున్నారు. అలాగే నిఫ్టీ ఒకానొక సమయంలో 15470 వద్దకు వెళ్లి మళ్ళీ కిందకు వచ్చి 15435 వద్ద ముగిసింది. మార్కెట్లు ఇలా పెరగటానికి దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ స్ ముఖ్య పాత్ర పోషించింది. ఈరోజు నిఫ్టీ పెరిగిన 97 పోయింట్లలో 90% రిలయన్స్ ఇండస్ట్రీ స్ కంట్రిబ్యూట్ చేసింది. ఈ ఒక్క రోజే RIL వంద పాయింట్ల కు పైగా పెరిగింది.పరిస్థితులు ఇలాగే ఉంటే జూన్ మాసం లో మార్కెట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు నమ్ముతున్నారు. ఈరొజు మార్కేట్ టాప్ గైనర్స్: 1) రిలయన్స్ ఇండస్ట్రీ స్. 2) గ్రాసిమ్. 3) ఆదని పోర్ట్స్స్. 4) ఎం@ఎం. 5) కోల్ ఇండియా.

4.92 ట్రిలియన్ లోన్ ఫ్రాడ్ :

 ఆర్బీబీఐ బ్యాంక్ లోన్స్ కి సంబంధించి ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేసింది.కొన్ని రోజుల క్రిందట ఒక వ్యక్తి రాయిట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) ద్వారా దేశీయ బ్యాంకుల లోన్స్ గురించి అడగగా, దీనికి ఆర్బీఐ స్పందిస్తూ దేశీయ బ్యాంకులకు సంబంధించిన ఫ్రాడ్ లోన్ స్టేట్మెంట్ ని విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత దేశ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 78,072 కోట్ల రిపోర్ట్ చేసింది. ఆ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 39,733 కోట్ల తో రెండో స్థానంలో ఉంది, కాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా 32,224 కోట్ల తో మూడో స్థానంలో నిలిచింది.యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత స్థానంలో ఉన్నాయి. దేశంలోని అన్ని బ్యాంక్లు కలిసి 4.92 ట్రిలియన్ లోన్ ఫ్రాడ్ ని ఆర్బీఐ కి రిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయమై దేశీయ ఆర్థిక నిపుణులు స్పందిస్తూ దేశంలోని బ్యాంకులు ఇలా పెద్ద మొత్తంలో ఫ్రాడ్ లోన్స్ రిపోర్ట్ చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని స్పష్టం చేశారు. కాగా బ్యాంకులు ఇంత మొత్తం ఫ్రాడ్ లోన్స్ రిపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి.ఈ ఫ్రాడ్ లోన్ అమౌంట్ దాదాపు ఇండియా లోని అన్ని బ్యాంకుల మొత్తం క్రెడిట్ లో 4.5%...